టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించి.. పలు అవార్డులు అందుకొని.. అరుదైన గౌరవాన్ని అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో మంగళవారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ, రాజకీయరంగం, సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఉన్నట్టుండి ఒక్కరోజులోనే ఆయన స్వర్గానికి వెళ్లిపోవడం చూసి ప్రతి ఒక్కరు తమ బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయిందంటూ మరింత బాధపడుతున్నారు.
ఇకపోతే ఆయన పార్థివ దేహాన్ని నిన్న వారి ఇంటికి తరలించగా .. అక్కడ పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. అయితే ఇప్పుడు అభిమానుల సందర్శనార్థం కోసం సూపర్ స్టార్ కృష్ణ భౌతిక ఖాయాన్ని నానక్ రామ్ గుడాలో ఉన్న తమ నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకి ఈరోజు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్ళనున్నారు.
సాయంత్రం 4:00గంటలకు సూపర్ స్టార్ కృష్ణ భౌతిక ఖాయానికి అంత్యక్రియలు జరపనున్నారు కృష్ణ కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ మరణం ఎవరు అంత త్వరగా జీవించుకోలేనిది అని చెప్పాలి. అంతే కాదు కృష్ణ మరణంతో ఒక శకం కూడా ముగిసిపోయింది. పంచ పాండవులుగా స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ , శోభన్ బాబు, ఏఎన్ఆర్, కృష్ణంరాజు , కృష్ణ ఇలా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులు అవడంతో వీరి శకం ముగిసినట్టు అయిపోయింది. ఏది ఏమైనా ఇంతటి గొప్ప నటులు మళ్లీ రారు అనే చెప్పాలి.