తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 503 పోస్టులకు గత ఏప్రిల్ నెలలలో నోటిఫికేషన్ విడుదలయింది. మే 31 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి టీఎస్పీఎస్సీ అనుమతి ఇచ్చింది. అయితే ఈ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకునే గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 4 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ప్రస్తుతం గ్రూప్ 1కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 503 పోస్టులకు గానూ మంగళవారం రాత్రి 11 గంటల వరకు 3,48,095 మంది అప్లై చేసుకున్నారు. అయితే చివరి తేదీ మే 31 వరకు గడువు కావడంతో చివరి రోజు చాలా మంది దరఖాస్తు చేశారు. అయితే పెమెంట్ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మరికొన్ని రోజులు గడువు పొడగించాల్సిందిగా అభ్యర్థులు కమిషన్ ను కోరారు. దీంతో కమిషన్ గడువును పెంచింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీలో 2011లో 302 పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే వచ్చిన 3,02, 912 దరఖాస్తులు ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 3.48 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.