జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు : దేశ ప్రజలకు భారీ ఊరట

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా చికిత్సకు ఉపయోగించే మూడు మందులకు జీఎస్టీ పన్నులు మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఇందులో ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే.. అంపోటెరిసిస్ -బీ పై జిఎస్టి మినహాయింపులు ప్రకటించింది.

అలాగే కరోనా మందులు, పరికరాల పై పన్నులు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఆక్సిజన్ యూనిట్లు టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సి మీటర్లపై కూడా జీఎస్టీ తగ్గించామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. టెంపరేచర్ చూసే పరికరాల పై 5% జిఎస్టి విధిస్తున్నట్టు తెలిపారు. అలాగే అంబులెన్స్ పై జిఎస్టిని 12 శాతానికి తగ్గించింది కేంద్రం. కరోనా వ్యాక్సిన్ పై 5% జిఎస్టి అమలు చేస్తున్నట్లు  నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.