తెలంగాణ ప్రభుత్వం పై గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో జూలై నెలలో ఇంత వరద రాలేదు.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తోందన్ తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్ళలేకపోయే ప్రాంతాలకు బోట్లు, హెలికాప్టర్ల ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నామని.. మా ముఖ్యమంత్రికి ప్రచారం ఇష్టం ఉండదని వెల్లడించారు.
చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నారు. బ్యాక్ వాటర్స్ వల్ల ఇబ్బందులు సహజమని.. ఏ ప్రాజెక్టు కట్టినా బ్యాక్ వాటర్స్ వస్తాయని చెప్పారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తీసేస్తారా?? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక నాలుగు ఓట్ల కోసం ఇలా రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని టిఆర్ఎస్ పై విమర్శలు చేశారు.
ముందు ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో పువ్వాడ అజయ్ చూసుకోమనండి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు మా పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.ఒక గిరిజన మహిళను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉన్నప్పుడు ఏ డిమాండ్లు పెట్టినా ఆమె గౌరవాన్ని తగ్గించటం అవుతుందని మండిపడ్డారు.