తెలుగు చిత్రసీమకు రెండు కళ్లున్నాయని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు ఏఎన్ఆర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏఎన్ఆర్ తను నటుడిగా కొనసాగుతున్న క్రమంలోనే తన వారసుడిగా తనయుడు నాగార్జునను లాంచ్ చేశారు. ఇక తనయుడి విజయాలు చూసి గర్వపడుతూనే తాను కూడా..పలు సినిమాలు చేశాడు.
ఇక అప్పట్లోనే ఏఎన్ఆర్ మల్టీస్టారర్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. ఏఎన్ఆర్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ట్రై చేశారు. కాగా అందులో కొందరు సక్సెస్ అయ్యారు కూడా. కానీ, ఆ ఫిల్మ్స్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఆ హీరోలు ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విక్టరీ వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ పిక్చర్ ఘన విజయం సాధించిన క్రమంలో నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేశారు. తన నెక్స్ట్ ఫిల్మ్ లో ఏఎన్ఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెలుసుకుని సంతోషించారు. అలా ఏఎన్ఆర్-వెంకటేశ్ కాంబోలో వచ్చిన ‘బ్రహ్మరుద్రులు’ పిక్చర్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..అప్పుడే సూపర్ హిట్ పిక్చర్స్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్-చిరు కాంబోలో తెరకెక్కిన ‘మెకానిక్ అల్లుడు’ ఫిల్మ్ లో ఏఎన్ఆర్ ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు.
అలా తొలిసారి చిరంజీవి-ఏఎన్ఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ, ఈ పిక్చర్ కూడా ఫ్లాప్ గానే నిలిచింది.
ఇక నందమూరి నటసింహం బాలయ్య-ఏఎన్ఆర్ కాంబోలో వచ్చిన పిక్చర్ ‘గాండీవం’. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ లో మాలీవుడ్(మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.