వైసీపీ,టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన గుంటూరు కార్పోరేషన్

-

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల బరిలో తొలిసారి అధికార వైసిపి బరిలో నిలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడమే ఇందుకు కారణం. తొలి సారి పోటీతోనే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైసిపి టార్గెట్ పెట్టింది. మరోవైపు ఇక్కడ సత్తా చాటాలని టిడిపి కూడా పోరుకు బరిలో నిలిచింది. ఒకపోతే జనసేన -బిజెపి కూటమి కూడా తామే కీలకం అంటూ రంగంలోకి దిగుతోంది.

గుంటూరు కార్పొరేషన్ ను అధికార వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధాని ప్రాంతానికి సమీపంలోని కొర్పొరేషన్ కావడంతో ఇక్కడ విజయాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. అమరావతి నినాదం గట్టిగా వినిపించే ప్రాంతంలో కూడా జెండా ఎగురవెయ్యాలని చూస్తోంది. మరోవైపు ఇక్కడ ఓటమి చెందితే ఉనికి కే ప్రశ్నార్థకం అని టిడిపి భావిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా అధినేత సూచనలతో రంగంలోకి దిగారు. అయితే టిడిపికి స్థానికంగా నాయకత్వ లోపం కనిపిస్తుంది. గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా పార్టీ మారడం తో టిడిపి నాయకత్వం కోసం ఇబ్బంది పడుతుంది. ఎంపి జయదేవ్ ఉన్నప్పటికీ ఆయన మొత్తం ఎన్నికలను బుజాన వేసుకున్న పరిస్తితి లేదు. కొద్దిరోజుల క్రితం రాజధాని ప్రాంతమైన తాడికోండ నియోజకవర్గంలో మొత్తం 46 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగ్గా..రెబల్ తో కలుపుకుని 38 చోట్ల వైసిపి విజయం సాధించింది. దీంతో ఆ ప్రాంతంలోనే వైసిపి గెలవగా లేనిది ..గుంటూరులో గెలవదా అంటూ వైసిపి నేతలు అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే ఎన్నికల్లో ఈ సారి మిత్ర పక్ష కూటమి కూడా రంగంలోకి దిగింది. స్థానికంగా ఉన్న సామాజిక పరిస్తితులు, ఇతర అంశాల కారణంగా గెలపుపై ఆశలు పెట్టుకున్నారు జనసేన – బిజెపి అభ్యర్థులు. మొత్తం 57 డివిజన్లు ఉండగా…వీటిలో ఇద్దరు కలిసి 48 చోట్ల పోటీ చేస్తున్నారు. జనసేన 28 చోట్ల, బిజెపి 18 చోట్ల పోటీ చేస్తుంది. ఈ 46 స్థానాలలో అధికంగా గెలుపొంది మేయర్ స్దానం విషయంలో తామే కీలకం అవుతామని వారు చెపుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంతో పోటీ పడి అధికార పార్టీ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికార వైసిపి 57 డివిజన్ల లో పోటీ చేస్తుండగా….జనసేన- బిజెపి 48 చోట్ల బరిలో దిగాయి. ఇకపోతే మొత్తం 57 డివిజన్లకు గాను టిడిపి…. సిపిఐకి మూడు డివిజన్లు కేటాయించింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నేతలు..అగ్రనేతల రాకకోసం ఎదురు చేస్తున్నారు. టిడిపి మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్ర ఉండగా..వైసిపి మేయర్ అభ్ర్థిగా కావటి మనోహర్ నాయుడును ఎంపిక చేశారు. సుదీర్ఘ కాలం తరువాత జరుగుతున్న మేయర్ ఎన్నికలు కావడంతో ఫలితం మరింత ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా గెలుపు అన్ని పార్టీలకు అనివార్యం గా మారింది. మరి గుంటూరు ఓటర్ ఎటువైపు ఉన్నారో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news