మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టార్గెట్ గా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీ నారయణ అసత్య ట్వీట్స్ చేశారు అని మండిపడ్డారు. అబద్దాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అని ఆరోపించారు. కరోనా సమయంలో మత రాజకీయాలు మానుకోవాలి అని ఆయన హితవు పలికారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బంగడుపుకోవాలని కన్నా చూస్తున్నారు అని మండిపడ్డారు.
దేవాలయాలో కోవిడ్ సెంటర్లు పెడుతున్నారని పోస్ట్ చేసిన కన్నాకు అసలు విషయం తెలుసా అని నిలదీశారు. దేవదాయ శాఖకు చెందిన సిబ్బంది అనేకమంది కరోనా బారిన పడ్డారు అని అన్నారు. ఉద్యోగులు, సిబ్బంది కోసమే ఆయా ఆలయాల కాటేజెస్, సత్రాల్లో కోవిడ్ సెంటర్స్ పెట్టారు అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రజలంతా సిఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అని అన్నారు. బిజెపిలో కన్నా మనుగడ కోల్పోయారు అని వ్యాఖ్యలు చేసారు. మీరుంటున్న ప్రాంత కార్పోరేటర్ పదవిని మీ పార్టీ గెలుచుకోలేకపోయింది అని ఎద్దేవా చేసారు.