ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాల విషయంలో ఆరోపణలు ఏ విధంగా వస్తున్నాయి ఏంటీ అనేది మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా ఏపీ ప్రతిపక్షం కీలక నిర్ణయం ప్రకటించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కూలిపోతున్దనే సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఏపీలో బడ్జెట్ పై విపులంగా చర్చ జరగాలని కాని తూతుమంత్రం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన ఆరోపించారు. ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని పేర్కొన్నారు. 2 లక్షల 15 వేల యాక్టివ్ కేసులు ఉంటే అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారని అచ్చెన్న ప్రశ్నించారు.