గుప్పెడంతమనసు ఎపిసోడ్ 316: రిషీతో డప్పు కొట్టించిన వసూ..చాటింగ్ లో బిజీ అయిపోయిన ప్రేమపక్షులు..!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ కార్ ట్రబుల్ ఇవ్వటంతో..వసూ, రిషీ కబుర్లు చెప్పుకుంటారు. వసూ మీకు ఏమైనా పాటలు వచ్చా అంటే..ఏంటి ఇప్పుడు నేను పాటలు పాడితే నువ్వు వింటావా అంటే..ఊరికే అడిగాను సార్ అంటుంది వసూ.ఇంకా నయం డ్యాన్స్ చేస్తారా అని అడగలేదు అంటాడు రిషీ. అప్పుడే కొంచెం దూరంలో డప్పు సౌండ్ వినిపిస్తుంది..సార్ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది..రండి సార్ వెళ్దాం అంటుంది. రిషీ ఎప్పటిలాగానే వద్దు అంటాడు. వసూ బలవంతం చేసి తీసుకెళ్తుంది. చలిమంట వెస్తున్నారు సార్ వెళ్దాం అని రిషీని తీసుకెళ్తుంది. రిషీ మనసులో ప్రతి దానిలో సంతోషం వెతుకుంటావ్..అందుకేనేమో నువ్వు సంతోషంగా ఉన్నావ్ అనుుకుంటాడు రిషీ. అక్కడ వాళ్లు జానపదం గీతం పాడతారు. ఒకరకంగా ఆ పాట రిషీ వసూలకోసం పాడినట్లే ఉంటుంది. వసూ ఆ డప్పు తీసుకుని కొడుతుంది. రిషీ కి కూడా ఇచ్చి డప్పు కొట్టిస్తుంది. అలా రిషీ డప్పుకొడుతూ డ్యాన్స్ చేస్తాడు. అందరూ భలే ఎంజాయ్ చేస్తారు.

మెకానిక్ వచ్చి కాల్ చేస్తాడు. రిషీ డబ్బులు వసూకి ఇచ్చి వాళ్లకు ఇవ్వమంటాడు. దేనికి సార్ అని వసూ అంటే..కల్మషం లేని వాళ్ల మనసులకు మనం ఇంతకంటే ఏం ఇవ్వలేం కదా అంటాడు. వసూ వాళ్లతో సెల్ఫీ తీసుకుందాం అంటుంది. రిషీ సరే అనటంతో వాళ్లతో కలిసి వీళ్లు సెల్ఫీ తీసుకుంటారు.

ఇంకోపక్క మహేంద్ర ఇంటికి వస్తాడు.దేవయాని సోఫాలోనే కునుకేస్తుంది. మహేంద్ర మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటాడు. దేవయాని లేచి..ఏంటి మహేంద్ర ఎక్కడికి వెళ్లావ్..అని రిషీ ఇంకా రాలేదు అంటుంది. వస్తాడులే వదినా అంటుంది. ఎ‌వరితో వస్తున్నాడు అంటుంది దేవయాని. మీ పెంపకం మీద నమ్మకం లేకపోయినా..నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అంటాడు మహేంద్ర. రిషీకోసం వెయిట్ చేసే అంత ఓపిక కూడా లేదా నీకు అంటే..మీరు డిస్టబ్ అయినట్లు ఉన్నారు..రిషీ వచ్చాక తనని కూడా డిస్టబ్ చేయకండి అని మహేంద్ర వెళ్లిపోతాడు. నేను డిస్టబ్ అయితే ఎలా ఉంటుందో 20 ఏళ్ల కిందట జగతి చూసింది. ఇప్పుడు మళ్లీ చూపిస్తా అని దేవయాని అనుకుంటుంది.

రిషీ వసూని ఇంట్లో డ్రాప్ చేస్తాడు. వసూతో కలిసి డోర్ వరకూ నడుచుకుంటూ వచ్చి..డోర్ కొట్టి అప్పుడు అంటాడు..వసుధార నీకొక విషయం చెప్పాలి అని..అప్పటివరకూ ఇద్దరే ఉన్నారుగా..అప్పుడు చెప్పొచ్చుగా..కరెక్టుగా ఇంటికి వచ్చి డోర్ కొట్టాకే చెప్పాలా..మనోడు స్టాట్ చేసే లోపు..జగతి తలుపు తీస్తుంది. లేట్ అయింది మేడమ్ ఇది చెప్పడానికే నేను ఆగాను అంటాడు రిషీ. పర్లేదుసార్ అని జగతి..వసూతో చలిగా ఉంది..కాఫీ తాగి వెళ్లమను అంటుంది. రిషీ ఇది కాపీ తాగే టైం కాదు..అడిగే టైం కూడా కాదని చెప్పు వసుధార అని రిషీ వెళ్లిపోతాడు. వసూ ఏదో చెప్పాలన్నారు రిషీ సార్ చెప్పకుండానే వెళ్లిపోతున్నారు అనుకుంటుంది.

రిషీ ఇంట్లో మహేంద్ర సోఫాలో పడుకుని ఉంటాడు. రిషీ చూసి డాడ్ నాకోసం ఎదురుచూసి ఇక్కడే పడుకున్నారా అనుకుని మహేంద్రను లేపుతాడు. నేను వస్తాను కదా..నా కోసం మీరు హాల్లో వెయిట్ చేయాలా అని మహేంద్రను లేపుతాడు. మహేంద్ర ఎందుకు లేట్ అయిందని అడగను రిషీ ఎన్ని జ్ఞాపకాలు మూటకట్టుకున్నావో అనుకుంటాడు.

వసూ మనసులో రోజంతా నాతో ఉన్నారు..కానీ అప్పుడేం చెప్పలేదు అనుకుని..ఫోన్ చేద్దాం మా రిషీ సార్ ఏం చేస్తుంటారు అని ఫోన్ తీసుకుంటుంది.రిషీ వసూ గురించి ఆలోచిస్తూ వసూకి మెసేజ్ చేస్తాడు. నీకొక మాట చెప్పాలి అన్నాను.. గుర్తుచేయవా అని రిషీ మెసేజ్ పంపుతాడు. అడిగితే ఎక్కడ రిషీ కోపపడతాడో అనే కదా నేను అడగంది అనుకుని మర్చిపోయాను సార్ అని రిప్లైయ్ ఇస్తుంది. అవునా నేను మర్చిపోయాను గుర్తుకువచ్చినప్పుు చెప్తాను అని రిషీ మెసేజ్ పంపుతాడు. వసూ ఏం మర్చిపోయి ఉండరు..ఇగో మీకు..అసలు మీ ఇంటి పేరే ఇగో అనుకుని..ఇంకేంటి సార్ విశేషాలు అని మెసేజ్ చేస్తుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయి భాగంలో వసూ హాల్ ఫ్లవర్స్ తో ఏదో చేస్తుండగా..రిషీ వచ్చి కార్ హారన్ కొడతాడు. వసూ ఆ ఫ్లవర్స్ తీసుకుని వెళ్లి స్వాగతం పలుకుతుంది. ఏంటి ఇది అంటే..తీసుకోండి సార్ అంటూ మాట్లాడుతుంది. జగతి డోర్ దగ్గర నిలబడి..ఇంటికొచ్చినవాళ్లను రోడ్డుమీదే నిలబెట్టి మాట్లాడతావా అంటుంది. రిషీ వసూ ఇంట్లోకి వస్తారు. మరో సీన్ లో దేవయాని వసుధార మీద అరుస్తుంది. వనబోజనాలు అయ్యాక..నువ్వు, రిషీ ఎక్కడికి వెళ్లారు. అర్థరాత్రుల్లు ఎక్కడ తిరిగావ్ అంటు సీరియస్ అవుతుంది. పక్కనే జగతి కూడా ఉంటుంది. రేపు చూడాలి దేవయానికి వసుధార ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుందో.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version