గుప్పెడంతమనసు 287: పెళ్లికి పిలవడానికి రిషీ ఇంటికి వచ్చిన శిరీష్..కానీ సీన్ మార్చేసిన మహేంద్ర

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని రిషీకి లెమన్ టీ తీసుకెళ్తుంది. టీ ఇచ్చి చిన్నగా కూపీలాగటం మొదలేస్తుంది. నాన్న రిషీ ఈ మధ్య నీలో ఏదో తేడా కనిపిస్తుంది అంటుంది. ఏం లేదు పెద్దమ్మా నేను బానే ఉన్నాను అంటాడు రిషీ. నాకూడా చెప్పకుండా ఎలా నాన్న…వాళ్లిద్దరూ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటుంది. రిషీ పెద్దమ్మా నన్ను వాళ్లు ఇబ్బందిపెట్టటం ఏంటి అంటాడు. అయినా దేవయాని అదే టాపిక్ తీస్తుంది. రిషీ మనకు సంబంధంలేని వాళ్ల గురించి మనం డిస్క్ స్ చేసుకోవటం అనవసరం..మన గురించి ఏమైనా ఉంటే చెప్పండి అని..ఒకరేమో మనకు సంబంధంలేని వ్యక్తి, ఇంకొకరు పెళ్లిచేసుకోని వెళ్లిపోతున్న వ్యక్తి..వాళ్లతో మనకేంటి సంబంధం అని ఓ లైఫ్ ఎక్సాంపుల్ చెప్తాడు. దేవయాని మనసులో నువ్వు ఆ జగతిని పట్టించుకోవటం లేదు, వసుధార వెళ్లిపోతుంది..నాకు అంతకన్నా ఇంకేం కావాలి అనుకుంటూ వెళ్లిపోతుంది. రిషీ కూడా మనసులో వసుధార గురించి మిమ్మల్ని మాట్లాడొద్దన్నాను కానీ, వసుధార ఆలోచనలను మర్చిపోవటం నావల్ల కావటం లేదు, నేనేం చేయాలి, ఎలా స్పందించాలో నాకే అర్థంకావటంలేదు అని వసూ గురించి ఆలోచిస్తాడు.

ఇటుపక్క జగతి, మహేంద్ర మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లో కూడా మిషన్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలా అంటే..ఇంట్లో కాలేజ్ విషయాలు మాట్లాడొచ్చు, కాలేజ్ లో ఇంటి విషయాలు మాట్లాడకూడదు అంటుంది జగతి. ఆహా చెప్పు ఇక అంటే..జగతి ఏదో ప్రోగ్రామ్ డిజైన్ గురించి చెప్తుంది. వీళ్లు ఇలా మాట్లాడుకుంటుండగా..వసుధార వస్తుంది. పుష్ప ఆర్టికల్ రాయను అని చెప్పిందని జగతీవాళ్లకు చెప్తుంది. మహేంద్ర దీనికూడా టెన్షన్ పడాలా..నువ్వురాసేయ్..మేడమ్ చూసుకుంటుంది తర్వాత అంటాడు. జగతి కూడా నువ్వురాయి వసూ..రిషీకి కోపం వస్తే తర్వాత చూసుకుందాం అంటుంది. అలా మహేంద్ర, జగతి వసూని రాయమని ప్రోత్సాహిస్తారు. అలా ఈ సీన్ అయిపోతుంది.

వసూ పెన్ను, పేపర్ తీసుకుని రాద్దాం అనుకుంటుంది కానీ…వసూకి ఏం మూడ్ బాగుండదు..ఎవరికి చెప్పిన పని వాళ్లు చేస్తే బాగుంటుంది వసుధార అన్న రిషీ మాటలు గుర్తుకువస్తాయ్..అడిగిరాద్దాం అనుకుని రిషీకి మెసేజ్ చేస్తుంది. రిషీ ఆ పొగరు ఏం చేస్తుంటుంది..శిరీష్ తో ఫోన్లో మాట్లాడుతుంటుందా అనుకుంటాడు..ఇంతలో వసూ మెసేజ్ వస్తుంది. సార్ మాట్లాడొచ్చా, కాల్ చేయాలా అని వసూ పెట్టిన మెసేజ్ కి..వద్దు నో కాల్స్ ప్లీజ్ అని రిప్లైయ్ ఇస్తాడు. వసూ ఒక చిన్న అనుమతి కావాలి సార్ అని మళ్లీ మెసేజ్ చేస్తుంది. రిషీ అన్నీ నా అనుమతి తీసుకునే చేస్తున్నావా అనుకుని గుడ్ నైట్ చెప్తాడు. వసూ ఏంటి సార్ ఇది అనుకుంటుంది. ఇటుపక్క రిషీ ప్రతిచిన్నదానికి సారీ చెప్తావ్ గా…శిరీష్ తో పెళ్లి గురించి నా దగ్గర దాచినందుకు ఎందుకు సారీ చెప్పలేదు వసుధార, నువ్వు స్పెషల్ స్టూడెంట్ వి అనుకుని భ్రమపడ్డాను వసుధార అనుకుంటాడు.

మరోపక్క వసూ రాయకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. జగతి వచ్చి రాశావా అంటే..రాద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను..రిషీ సార్ తిడతారేమో అని అంటుంది. నువ్వు చేస్తుంది కాలేజ్ పనే కదా, పుష్ప చేయలేంది నువ్వు చేస్తున్నావ్..మన మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఒక పేపర్ లో వస్తే అది ఎంత అర్థవంతంగా ఉండాలి చెప్పు..ఏదో ఒకటి రాస్తే మనకాలేజ్ కే నష్టం కదా..నువ్వురాయ్..డీబీఎస్టీ ఫ్యాకెల్టీ హెడ్ గా నిన్ను రాయమనే అధికారం నాకు ఉంది, నువ్వు రాయి..నువ్వు బాగా రాస్తే రిషీ కోపం కూడా పోతుందిగా..ఇది మనసులో పెట్టుకుని బాగా రాయటానికి ప్రయత్నించు, భయం అడుగుముందుకు పడనివ్వదు వసూ అని ధైర్యం చెప్పి వెళ్తుంది. వసూ రాయటం మొదలేస్తుంది.

మరుసటిరోజు ఉదయం..శిరీష్, వసూ రిషీ వాళ్ల ఇంటికి వస్తారు. అప్పుడే రిషీ కిందకు దిగుతుంటాడు. ధరణి కాఫీ ఇస్తుంటే..శిరీష్ వద్దంటాడు. వసూ నేను షేర్ చేస్తాను అని తన కాఫీ షేర్ చేస్తుంది. అది చూసిన రిషీ..పాపం ఫీల్ అయ్..మళ్లీ పైకి వెళ్తాడు. రిషీ ఏదో ఆలోచిస్తున్నారు అని మహేంద్రను అడుగుతుంది. మహేంద్ర ఏదో ఒకటి చెప్తాడు. రిషీ గురించే అనుకోండి. మహేంద్ర మనసులో శిరీష్ ద్వారా రిషీకి అసలు విషయం తెలియకుండా జాగ్రత్తపడాలి అనుకుంటాడు. శిరీష్ వసూ చెవిలో ఏదో మాట్లాడుతుంటాడు. మహేంద్ర ఆఫీసర్ ఏంటి ఆ గుసగుసలు మాకు చెప్పొచ్చుకదా అంటే…వసూ శిరీష్ రిషీ సార్ ని కలుస్తాడంట అంటుంది. మహేంద్ర నో నో వద్దమ్మా, ఛాన్స్ హే లేదు అంటాడు. శిరీష్ ఏమైంది సార్ రిషీని కలిస్తే అంటారు. మహేంద్ర శిరీష్ కలిస్తే..నేను పడిన కష్టమంతా వృథా అవుతుందని రిషీనే ఇక్కడికి రమ్మంందాం అంటాడు. సరే అంటారు. మహేంద్ర వసూ నువ్వెళ్లి రిషీని పిలుచుకురా అని పంపిస్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news