తిరుపతిలో దక్షిణాది సీఎంల భేటీ… కీలక అంశాలపై చర్చ..!

ఈనెల 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది సీఎంలు భేటీ కానున్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. అంతేకాకుండా ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ లు హాజరవుతున్నారు.

ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం తోపాటు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ఆంధ్ర కు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తనున్నారు. ఇప్పటకే ఈ సమావేశం పై ఏపీ సీఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణతో ఉన్న నీటి వివాదం పైన కూడా సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విభజన హామీల అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది.