గుప్పెడంతమనసు ఎపిసోడ్ 318: రిషీ వసుధారలను విడదీసిన దేవయాని..అప్పుడు జగతికి జరిగిందే ఈరోజు వసూకి..!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని జగతి, వసూ వాళ్లతో సీరియస్ గా మాట్లాడుతుంది. దేవయాని రిషీ మనసులో నువ్వు లేవు, లేకుండా చేశాను, కాదు కూడదని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను తిప్పి కొడుతూ ఉంటాను..వనభోజనాలకు వెళ్లినవాళ్లు ఇంటికిరాకుండా..అర్థరాత్రుళ్లు తిరగటమేంటో నువ్వైనా మీ శిష్యురాలికి చెప్పాలికదా అంటే..వసూ ఒకరు చెప్తే వినేంత చిన్నదాన్ని కాదు..ఎంచేయాలో, ఎంచేయకూడదో నాకు తెలుసు..మీకు ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే..వెళ్లి రిషీ సార్ ని అడగొచ్చు అంటుంది వసూ. మాటకు మాట చెప్తుంది జగతి..ఇదే దూకుడు తగ్గించుకోమని చెప్తున్నాను నేను అంటుంది దేవయాని. ఎవరు ఎలా ఉండాలో మీరు డిసైడ్ చేయాల్సిన పనిలేదు, నేను ఎలా ఉండాలో, నేను ఏం మాట్లాడాలో, ఎక్కడెక్కడికి వెళ్లాలో మీరు కాదు చెప్పాల్సింది అంటుంది వసూ. ఇంతలో జగతి వసూ ఊరుకో..వాళ్లు అరిచారని మనం అరిస్తే..వాళ్లకు మనకు తేడా ఉండుదు అంటే..వసూ ఒకరు అరుస్తూ చెప్తే మనం కూడా వాళ్లకు అదే భాషలో సమాధానం ఇవ్వాలి, మీలా మృదువుగా చెప్తే..వాళ్లకు అర్థంకాదు మేడమ్ అంటుంది వసూ..దేవయాని జగతి నీకు ఇదే చివరి హెచ్చరిక..నేనేంటో నా ఆలోచనలేంటో నీకు బాగా తెలుసు..నీ పద్దతి మార్చుకోకపోతే.. పరిస్థితులు వేరేలా ఉంటాయ్ అంటు హెచ్చరిస్తుంది.
జగతి మీరు వీధిలోకి వచ్చి అరిచినంత మాత్రానా ఎవరూ భయపడరూ …దయచేసి వెళ్లిపోండి అక్కయ్య అంటుంది. వసూ మీ బెదిరింపులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు అంటుంది . జగతి నేను నిన్ను మాట్కలాడొద్దన్నానా..పద వెళ్దాం అని జగతి వాళ్లు వెళ్లిపోతారు.
కాలేజ్ లో ఉన్న రిషీకి దేవయాని కాల్ చేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడలేను లంచ్ టైం లో మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. దేవయాని ఈ మధ్య రిషీ నా ఫోన్ కూడా కట్ చేస్తున్నాడు..ఇది జగతికి బాగా బలం ఇస్తుంది. చూస్తాను అనుకుంటుంది..కాలేజ్ లో వస్తున్న వసూ, జగతి..జరిగింది ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని రిషీ దగ్గర ప్రస్థావించకు అంటుంది జగతి. ఎందుకు చెప్పొద్దు మేడమ్..చెప్పాలి, నిజం ఎలా తెలుస్తుంది అంటుంది వసూ. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా..రిషీ వచ్చి ఏంటి లేట్ అంటాడు. వసూ చెప్పబోతే..జగతి చేయ్ పట్టుకుంటుంది.
రిషీ నేను అడుగుతుంటే..తను ఆపుతుంది. నా ముందే తనని కంట్రోల్ చేస్తుంది అనుకుంటాడు. ఏంటి లేట్ అని మళ్లీ అడుగుతాడు. జగతి క్లాస్ టైం అవుతుంది. వెళ్తావా అంటాడు. రిషీ కాలేజ్ అయ్యాక కలువు అని వెళ్లిపోతాడు. వసూ క్లాస్ ఇస్తారేమో అంటాడు. జగతి మ్యాటర్ చెప్పొద్దని..వసూ చెప్పాలని వాదించుకుంటారు. ఫైనల్ గా ఈ డిస్కషన్ ఇలా కాలేజ్ లో మాట్లాడుకోవటం కరెక్టుకాదు నువ్ువ క్లాస్ కి వెళ్లి అని వెళ్లిపోతుంది. వసూ మేడమ్ ఏంటో..అవసరానికి మించి ఓపిక పడతారు అనుకుంటుంది.
కట్ చేస్తే..కాలేజ్ అయిపోతుంది. రెస్టారెంట్ లో జగతి ఉంటుంది. వసూ సీరియస్ గా సర్వ్ చేస్తుంది. జగతి రిషీ నిన్ను కాలేజ్ అయ్యాక కలవమన్నాడు కదా..వెళ్లలేదు కదా..రిషీకి కోపం వస్తుందేమో అంటుంది. కోపం వస్తుందనే కలవలేదు మేడమ్..నాకు కోపం వస్తుందని..నేను కంట్రోల్ తప్పి రిషీ సార్ కి ఎదురు మాట్లాడితే..మీరు బాధపడతారని వెళ్లలేదు అంటుంది వసూ. ఇంత దూరం ఆలోచించావు కదా..ఆ కోపాన్ని దూరం పెట్టలేవా అంటుంది జగతి. న్యాయంగా కూడా కోపం రాకపోతే..అన్యాయం కదా మేడమ్ అంటుంది వసూ. ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా. దేవయాని రెస్టారెంట్ కి వస్తుంది. దేవయానికి ఎవడో ఫోన్ చేసి..వాళ్లు లోపలే ఉన్నారు మేడమ్, నేను వాళ్ల వెనుకే రెస్టారెంట్ లోనే ఉన్నాను మేడమ్ అని చెప్తాడు. దేవయాని లోపలికి వస్తుంది. ఒక అబ్బాయి దేవయాని దగ్గరకు వస్తాడు. రిషీ సార్ రాగానే మెసేజ్ పెట్టు అంటుంది దేవయాని.
దేవయాని జగతి… వస్తున్నాను..ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అనుకుంటుంది. మరోపక్క ధరణి టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది. మహేంద్ర వచ్చి ఏంటి ధరణి రమ్మన్నావేంటి అంటాడు. అత్తయ్యగారు బయటకు వెళ్లారు, జగతి అత్తయ్యను కలవడానికి వెళ్లారంట అంటుంది అప్పుడే రిషీ వస్తాడు. ఈ టైంలో జగతి అత్తయ్య, వసుధార ఎక్కడున్నారని అడిగిమరి వెళ్లారు. అత్తయ్యగారు ఏదో ప్లాన్ చేశారని నాకు టెన్షన్ గా ఉంది అని ధరణి అంటుంది. రిషీకి దేవయాని వాయిస్ మెసేజ్ పెడుతుంది. నాన్న రిషీ నన్ను క్షమించు, నీకు తెలియకుండా నీకు నచ్చిని వ్యక్తుల దగ్గరకు వెళ్తున్నాను అని పంపుతుంది.
పెద్దమ్మను వసూధార వాళ్లు ఏమైనా ఇబ్బంది పెట్టారా అనుుకుని రిషీ వెళ్లిపోతాడు. రిషీ వెళ్లటం మహేంద్ర చూస్తాడు.. ఇక్కడ రెస్టారెంట్ లో దేవయాని జగతితో కుర్చుంటుంది. ఏంటి అక్కయ్య మీరు ఎందుకు వచ్చారు, అప్పటినుంచి ఏం అడిగినా సమాధానం చెప్పటం లేదేంటి అంటుంది. దేవయాని మనసులో ఇంకా మెసేజ్ రాలేదేంటి..రిషీ మెసేజ్ చూసుకున్నాడో లేదో అనుకుని..కాఫీ తాగటానికి వచ్చా..మిమ్మల్ని చూసి ఆగాను అంటుంది దేవయాని. ఇలా దేవయాని కావాలని వాళ్లను రెచ్చగొడుతుంది. జగతి వెళ్లి రెండు కాఫీలు తీస్కురా వసుధార అంటే..రెండు కాదు మూడు తీసుకురా వసుధార..నీతో కలిసి కాఫీ తాగాలని ఉంది..ఏంటి నాతో కాఫీ తాగటానికి కూడా భయమా అంటుంది. నాకెందుకు భయం అని వసూ అక్కడున్న వ్యక్తికి మూడు కాఫీలు తెమ్మంటుంది అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.
తరువాయిభాగంలో దేవయాని వయసొచ్చిన కొడుకుమీదకు వసుధారను ఉసిగొలుపుతున్నావా అంటుంది. ఆ మాటకు జగతి , వసూలకు కోపం వస్తుంది. మర్యాదగా మాట్లాడండి అంటూ వసూ చేయి చూపించి మాట్లాడుతుంది. అప్పుడే రిషీ వస్తాడు. రిషీ రావటం చూసి దేవయాని కావాలని కిందపడుతుంది. రిషీ పరుగెత్తుకుంటూ వచ్చి దేవయానిని లేపుతాడు. వసుధార చెప్తుంటే..రిషీ కోపంగా షట్ అప్ వసుధార, ఇంకొక్క మాట మాట్లాడావంటే అంటాడు. మొత్తానికి దేవయాని అనుకున్నది సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news