ఐపీఎల్ 2022 మెగా వేలానికి… మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో.. ఈ ఆటగాళ్లు ఏ టీం లోకి వెళ్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు అయిన మార్టిన్ గుప్తిల్, ట్రెంట్ బౌల్ట్ ఈసారి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడబోతున్నారని సమాచారం. ఇందుకోసం టీం మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది.
వేలం లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. మంచి బ్యానర్ అయిన గుప్టిల్, మంచి ఫేస్ బౌలర్ అయిన బౌల్ట్ జట్టులో ఉంటే టీం బలంగా తయారవు తుంది అని రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దీనికితోడు వీరిద్దరూ మ్యాచ్ విన్నర్ లు. వీటన్నిటినీ గ్రహించిన సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం…వీరిద్దరిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు డేవిడ్ వార్నర్ మరోసారి హైదరాబాద్ జట్టులోనే ఆడతారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.