RGV : ప‌బ్ లో హీరోయిన్ ను న‌లిపేస్తున్న ఆర్జీవీ…వీడియో వైర‌ల్…!

-

సంచల‌నాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం సినిమాల కంటే ఆయ‌న చేస్తున్న చేష్ట‌ల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. వ‌ర్మ త‌ర‌చూ ఏదో ఒక అంశంతో వివాదాల్లో నిలుస్తున్నారు. అంతే కాకుండా ప‌బ్బుల్లో తాగి హీరోయిన్ల‌తో డ్యాన్సులు చేస్తున్న వీడియోల‌ను షేర్ చేస్తూ సంచ‌ల‌నాలు రేపుతున్నాడు. రీసెంట్ టాలీవుడ్ కు చెందిన ఓ న‌టితో వ‌ర్మ చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజ‌న్లు మండిప‌డ్డారు.

వ‌ర్మ దిగ‌జారిపోతున్నాడు అంటూ కామెంట్లు పెట్టారు. ఇక తాజాగా వ‌ర్మ మ‌రో హీరోయిన్ తో స్టెప్పులు వేసిన వీడియోను షేర్ చేశాడు. వీడియోలో ఆర్జీవీ హీరోయిన్ కు ముద్దులు సైతం ఇస్తున్నాడు. వొడ్కా తాగుతూ హీరోయిన్ ను న‌లిపేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాంతో లైఫ్ అంటే ఆర్టివీ దేన‌ని నెటిజ‌న్లు కామెంట్ పెడుతున్నారు.

ఆర్జీవీలా ఒక్క‌రోజు బ్ర‌తికినా చాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు మీరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ అని ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీవి రీసెంట్ గా కొండ అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను మాజీ మంత్రి కొండా సురేఖ ముర‌ళి దంప‌తుల జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించారు.

ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా ఎంతో ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్ ల‌క్ష‌ల వ్యూవ్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఆర్జీవీ ఏపీ స‌ర్కార్ టికెట్ల అంశంపై కూడా త‌నదైన రీతిలో స్పందిస్తున్నారు. టికెట్ రేట్ల పై ప్ర‌భుత్వం ప‌రిమితులు విదించ‌వ‌ద్దు అంటూ మంత్రుల‌పై కౌంట‌ర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news