అబ్బాయిలు.. మీ హైట్‌ను బట్టి మీ నడుము చుట్టుకొలత ఎంత ఉండాలో తెలుసా..?

-

సాధారణంగా మన హైట్‌ను బట్టి మన బరువు ఉండాలి అంటారు. మనిషి బరువును సైజ్‌ను బట్టి కాదు.. వాళ్లు ఎత్తును బట్టి నిర్ణయించాలి…మీ హైట్‌ను బట్టి మీ నడుము చుట్టుకొలత ఎంత ఉండాలో తెలుసా..? దీన్ని బట్టి మీరు కరెక్ట్‌ వెయిట్‌ ఉన్నారా..? ఓవర్‌ వెయిట్‌ ఉన్నారా..చెప్పేయొచ్చు.. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ..! ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా ఉంటుంది.. చలో అబ్బాయిలకు అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం..!

పురుషులకు అయితే..

5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 24 ఇంచులు ఉండాలి. 28 ఇంచుల‌కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు. అదే 31కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లే.
5 అడుగుల 2 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 25 ఇంచులు ఉండాలి. 29కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 32కి పైన ఉంటే స్థూల‌కాయం ఉన్నట్లే.
5 అడుగుల 3అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు.. అదే 33కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు.
5 అడుగుల 4 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 27 ఇంచులు ఉండాలి. 31కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 34కి పైన ఉంటే స్థూల‌కాయమే.
5 అడుగుల 5 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 28 ఇంచులు ఉండాలి. 32కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 35కి పైన ఉంటే స్థూల‌కాయం.
5 అడుగుల 6 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 29 ఇంచులు ఉండాలి. 33కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌.
5 అడుగుల 7 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 31 ఇంచులు ఉండాలి. 34కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌.
5 అడుగుల 8 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 31.2 ఇంచులు ఉండాలి. 35కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 38కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
5 అడుగుల 9 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 31.7 ఇంచులు ఉండాలి. 36కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 39కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
 5 అడుగుల 10 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 32 ఇంచులు ఉండాలి. 37కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 40కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
5 అడుగుల 11 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 32.6 ఇంచులు ఉండాలి. 38కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 41కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
6 అడుగుల ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 33.1 ఇంచులు ఉండాలి. 39కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 42కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
6 అడుగుల 2 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 34 ఇంచులు ఉండాలి. 41కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 44కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లే.
6 అడుగుల 4 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 35 ఇంచులు ఉండాలి. 43కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 46కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.
దీన్ని బట్టి అబ్బాయిలు మీరు హెల్తీగా ఉన్నారా..లేక డేంజర్‌ జోన్లో ఉన్నారా గమనించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news