న్యాయవాదులకు భృతి విడుదల చేసిన సీఎం జగన్

-

రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. నేడు “వైయస్సార్ లా నేస్తం” పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి దీన్ని ప్రారంభించారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకుంటున్న వారికి వైయస్సార్ లా నేస్తం కింద ఆర్థిక సాయం అందజేస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కొత్తగా న్యాయవాద వృత్తి ప్రారంభించిన వారు, వారి వృత్తిలో నిలదొక్కుకునేందుకు వీలుగా మూడేళ్ల పాటు ప్రతినెలా ఈ సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ సాయంతో గత మూడున్నర ఏళ్ళలో మొత్తం రూ. 35.40 కోట్లను 4,248 మంతి న్యాయవాదులకు అందించనున్నట్టు చెప్పారు.

మూడు సంవత్సరాల పాటు నెలకు 5000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది జగన్ సర్కార్. పాదయాత్రలో న్యాయవాదుల సమస్యలు తెలుసుకున్నానని, జూనియర్ లాయర్లకు మొదటి మూడేళ్లు కష్టాలు ఉంటాయని, అందుకే వీరికి నెలకు 5 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించానన్నారు. అలాగే న్యాయవాదుల కోసం 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news