నిత్యం ఏపీ నాయకులపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వార్తల్లో నిలిచే జీవీఎల్ ఏపీ ఎంపీలపై కీలక ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ…కాంగ్రెస్, తెదేపా, తెరాస మూడూ ఒకే తాను ముక్కలన్నారు. ఇక ఏపీ ఎంపీలు మాల్యాను మరపించేలా ఉన్నారని విమర్శించారు.
మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు తెరాస అధినేత కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేదని మండిపడ్డారు. తెదేపా – తెరాస, కాంగ్రెస్-తెరాసలు కూటములుగా గతంలో కలిసి పనిచేసిన బంధం ఇంకా కొనసాగుతుందన్నారు.
చంద్రబాబు నాయుడు – రాహుల్ గాంధీలు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలో కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. తెదేపా ఎంపీ సుజనా చౌదరి 5700 కోట్ల రూపాయలు టూటీ చేయడంతో మాల్యాని మించిపోయారన్నారు. జీవీఎల్ కామెంట్స్ కి సామాజిక మాధ్యమాల్లో ఊహించని కౌంటర్లు పడ్డాయి… ముందు మీ పార్టీలో ఉన్న మాల్యాలను తీసుకురండీ… దేశం విడిచి పోయిన మాల్యాను ఇప్పటికీ భారత్ కి రప్పించలేక పోయారు..ఇక మీరు మీ..నాటకాలు చాలూ..అంటూ పలువురు స్పందించారు.