జీవీఎల్ ను తప్పించారు.. వారు హ్యాపీ అంట!

-

జీవీఎల్ ను తప్పించారు.. వారు హ్యాపీ అంట!నేను పాస్ కాకపోయినా పర్లేదు.. నా శత్రువు ఫెయిల్ అయ్యాడు.. అంతేచాలు.. అన్నట్లుగా ఉందంట టీడీపీ నేతల ఆనందం! ఇప్పటికే ఏపీలో కన్నా లక్ష్మీనారాయణను తొలగించి అధ్యక్ష బాధ్యతలు సోము వీర్రాజుకు ఇచ్చినప్పుడే.. ఇక బాబు – బీజేపీ కలిసే ప్రసక్తి లేదని అంతా భావించారు! రాష్ట్రస్థాయి సంగతులు అలా ఉంటే.. జాతీయస్థాయిలో జీవీల్ వంటి వారు బాబు పేరు చెబితే ఫైరయ్యేవారు… జాతీయస్థాయిలో టీడీపీని బీజీపీతో కలిసే అవకాశాలు లేకుండా చేసేవారు అని అంటుంటారు తమ్ముళ్లు! ఇప్పుడు ఆ జీవీఎల్ ను బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించేసరికి బాబు & కో కాస్త హ్యాపీ ఫీలవుతున్నారంట!

అవును… జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ప్రకటించిన సంగతి తెలిసిందే! అందుకు పసుపు మీడియా రాసుకొస్తున్న కారణాలు…. “జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందువల్లే తప్పించారు” అని! ఎల్లో మీడియాకు అంత ఆనందం కలిగిందంటే… జీవీఎల్, టీడీపీని బాగానే డిస్ట్రబ్ చేసినట్లన్నమాట!

అయితే వీరి ఆనందం అలా ఉంటే… జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ తో పాటుగా, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు తెలుగువారు రాంమాధవ్‌, మురళీధర్‌ రావులను కూడా తప్పించారు. ఇందుకు కారణాలు… ప్రధాని నరేంద్రమోదీ త్వరలో తన కేబినెట్ ‌ను విస్తరించనున్నట్లు, అందులో మంత్రులుగా అవకాశం కల్పించేందుకే కొందరు నేతలను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ న్యూస్ తమ్ముళ్లకు ఎలాంటి ఆనందాన్ని కలిగిస్తుందో చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news