టిడిపి, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందని.. లేదంటే హైదరాబాద్ ఏ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2024 లో జగన్ ఓటమిపాలైతే అమరావతి లోనే ఉంటారని గ్యారంటీ ఉందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా పేరు జగన్, నేను ఇక్కడే ఉంటానని అన్నారని.. గతంలో అమరావతి విషయంలోనూ అదే చెప్పారని గుర్తు చేశారు.
ఇక హైదరాబాద్ ని అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఆయన ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్ ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. అధికారం కావాలంటే ఆంధ్ర జనాన్ని వాడుకోవాలి.. అధికారం పోయాక హైదరాబాదులో మీ ఆస్తులను పెంపొందించుకోవాలి.. ఇదేనా మీ ఆలోచన? అని నిలదీశారు. మీ ప్రాంతం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.