జీవితాన తోచని దిక్కు ఒకటి నిద్రాణవస్థల్లోనూ వెన్నాడుతోంది.అవి దారులను ఛిద్రం చేస్తాయి. నమ్మకాలను వద్దని, విశ్వాసాలను వద్దని చెప్పి పోతాయి. చదివిన వాక్యం మార్చి రాస్తున్నాను. నిద్రకు వెలి అయి ఒంటరిగా ఉండిపోయిన కాలాలను తిట్టుకున్నాడు ఒక కవి. నిద్రనూ,జీవితాన్నీ వేరుగా చూసి వాంఛలకు అతీతం అయిన కాలాన్ని దేహంపై నిక్షిప్తం చేయడం రాత్రి చేయదు. యుద్ధం చేయదు.
యుద్ధ కాలాల సన్నాహాలు నిక్షిప్త కాలాల చెంత ఉండువు. అవి కొన్నిమనలో అవి కొన్ని ఇతరుల్లో ఉంటే బాగుండు. నిక్షిప్తం అయినవి ప్రత్యక్షం అయినవి స్వానుభవం నుంచి ఇతరుల ఉద్వేగం వరకూ ఉంటే ఇంకా బాగుంటుంది. అయినా మనం కాలాలను దాటి యుద్ధాలు చేయడం లేదు. యుద్ధ కాల మేఘావర్ణంలో ఉంటూ చేస్తున్న ఛిద్రం అయిన ప్రయత్నం ఈ యుద్ధం.
యుద్ధాన్ని నిర్వచించండి అని అన్నారొకరు.ఉక్రెయిన్ యుద్ధం వేరు..రష్యా యుద్ధం వేరు.పాలసీలు మారిపోతున్న కొద్దీ ప్రాధాన్యాలు మారిపోతాయి చూడండి అప్పుడు యుద్ధం ఓ క్షణిక సంబంధ ఆవేశానికి ప్రతిరూపం కావొచ్చు. విస్తృతం అయిన యుద్ధం ఈ ధరాతలాన్నీ లేదా ఈ ఇలాతలాన్నీ ఉద్ధరిస్తుంది అని చెప్పలేను. ఊరి నుంచి ఊరి వరకూ యుద్ధం బాగుంది. అవును! శిమ్మ వైశాలి అనే అమ్మాయి పాతపట్నంకు వచ్చేసింది.
సొంత ఊరికి వచ్చేసింది. ఇందుకు ఎంపీ రాము కొంత సాయ పడ్డారు. చంద్రబాబు ధైర్యం చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ లో భాగంగా ఆమెకు ఇంటికి దారి రుమేనియా నుంచి దొరికింది. ఇంకొందరికీ కావాలి.వస్తే బాగుండు. దారి బాగుంది అని చెప్పడంలో భారతీయ విద్యార్థులు బాలేరు. వారి మనస్తత్వ చింతన గురించి ఓ చోట చదివేను. తమ కన్నా ఇతరులు బాగుండాలి అని కోరుకోవడం భారతీయత కు సంకేతం అన్న అర్థం వచ్చే విధంగా వారి రీతి ఉందని.. చదివేను.
ఆనందించేను.దారి ఇప్పుడు శుభ్రతకు ఆనవాలు కాదు కనీసం ఖండిత దేహాల గుర్తింపునకు తావిస్తే చాలు.ఆ తోవలో జ్ఞాపకం ఒక నిద్రాణం దేశం ఒక చైతన్యం మరణం ఒకటి చైత్ర గాన సంబంధితం.. కనుక శివ రాత్రి వేళల్లో అహం వెలిగి లీనుతోంది. పుతిన్ మరియు ఇంకొందరు ఆ రూపాలను తమకు అన్వయించుకుని తీరడం ఇప్పటి దుఃఖం. అఖండం ఒకటి అమేయం ఒకటి జీవితాన వెలుగుతూ ఆరుతూ నవ్వుతూ తుళ్లుతూ.. థాంక్ యూ రాము సర్.. థాంక్ యూ బాబు సర్.. మరియు నా దేశ విదేశాంగ శాఖ కు కూడా! ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు తగువులాట మానుకుని భారతీయ విద్యకు ప్రాధాన్యం ఇస్తే విదేశీ విద్యకు పరుగులు ఆపడం సులువు.
అని అనుకోవడం ఓ వింత..అవి జరగవు అని నిర్థారించడం మరో దయనీయత. నిరామయం చెంత ప్రపంచ మోసే దుఃఖాలను వెలుగులనూ సర్వసమానం చేయడంలో మరణం ఒక సమకాలీన బాధ్యతను నిర్వర్తిస్తుంది. చావు నిద్రకు వెలి.. పుట్టుక నిద్ర లోగిలి.. అంతకుమించి చెప్పడంలో కవి లేడు.
ఆ దరిద్రం మనకు వద్దు గాక వద్దు. అండ్ ద టైటిల్ ఈజ్ ఆ శవం పేరు శ్రీశ్రీ.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి..
– హమారా సఫర్ – మన లోకం ప్రత్యేకం
ఆర్ట్ : బాబు దుండ్రపెల్లి – భాగ్య నగరి
పోస్టర్ డిజైన్ : ప‌్రభాకర్ అనుపోజు – భాగ్య నగరి