తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టెన్త్ క్లాస్ పేపర్ ను షేర్ చేశారన్న అభియోగం మీద అరెస్టై ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ అధిష్టానం ఎలాగైనా బెయిలును ఇప్పించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాసేపటి క్రితం హనుమకొండ కోర్ట్ లో మెజిస్ట్రేట్ కు మరియు బండి సంజయ్ న్యాయవాదులకు మధ్యన కాస్త వాదనలు జరిగాయి. బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పై మీ నిర్ణయాన్ని ప్రకటించకపోతే మేము వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకుంటాం అంటూ అడిగారు.
లేదా మీరు అయినా బెయిల్ ను డిస్మిస్ చేయాలనీ విజ్ఞప్తి చేశారు. అయితే జడ్జి లు మాత్రం డిస్మిస్ చేయడం కుదరదు మరియు పిటిషన్ ను మీరు వెనక్కు తీసుకోవడం కుదరదని జడ్జి తేల్చి చెప్పారు. అయితే కాసేపట్లోనే నిర్ణయాన్ని తెలియచేస్తామని చెప్పారట. మరి ఏమి చేస్తారో చూడాలి.