ధోనిపై హర్భజన్‌ సంచలన వ్యాఖ్యలు…అతన్ని ఎందుకు పొగుడుతున్నారు !

-

టీంమిడియా జట్టుకు ఎంఎస్‌ ధోని ఎన్నో విజయాలను సాధించి పెట్టాడు. మూడు ఐసీసీ టైటిళ్ల ను కూడా ధోని టీమిండియా అందించాడు. అయితే.. అలాంటి ప్లేయర్‌ ధోనిపై మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే.. ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ గెలిచిందని..అంటారు.

అదే టీమిండియా విజయం సాధిస్తే.. మహేంద్ర సింగ్‌ ధోని వరల్డ్‌ కప్‌ గెలిచాడని అంటారు. ఎంఎస్‌ ధోని వరల్డ్‌ కప్‌ గెలిస్తే.. మరి మిగిలిన 10 మంది ఏం చేశారు. నేను, గౌతమ్‌ గంభీర, యువరాజ్‌ సింగ్‌ ఏం చేశాం.. లస్సీ తాగడానికి వెళ్లామా.. ఇది టీం గేమ్‌. అందరం కలిసి ఆడటం వల్లే వరల్డ్‌ కప్‌ గెలిచామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బజ్జీ. ఏ ఒక్కరి వల్లా వరల్డ్‌ కప్‌ రాదు.. అంటూ తన స్టైల్‌ లో చెప్పుకొచ్చాడు హర్భజన్‌ సింగ్‌. అయితే.. బజ్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎం ఎస్‌ ధోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని వల్లే వరల్డ్‌ కప్‌ వచ్చిందని కామెంట్స్‌ చేస్తున్నారు మహీ ఫ్యాన్స్‌.

Read more RELATED
Recommended to you

Latest news