ఆస్ట్రేలియా టూర్ కి ఇండియా జట్టు బయలుదేరినప్పటి నుండి ఆటగాళ్లపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే మాజీ ఆటగాళ్ళు అనేక సలహాలు ఇస్తున్నారు. ఇంతలా ప్రశ్నలు, సలహాలు రావడానికి ముఖ్య కారణం.. కోహ్లీ టెస్టు మ్యాచులకి హాజరు కాలేకపోవడమే. వన్డేలు, ట్వంటీ ట్వంటీలకి హాజరు అవుతున్న కోహ్లీ ఒక టెస్ట్ ఆడిన తర్వాత ఇండియా తిరిగి రానున్నాడు. కోహ్లీ భార్య బిడ్డకి జన్మనివ్వబోతున్న నేపథ్యంలో పితృత్వ సెలవులు తీసుకున్నాడు.
ఐతే కోహ్లీ లేని ఆట ఎలా ఉంటుందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ వెళ్ళిపోయాక ఆడే మూడు టెస్టులకి అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. దాంతో అజింక్య రహానేకి హర్భజన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. రహానే మంచి ఆటగాడు. అతడి కెప్టెన్సీ చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచుల్లో కూడా అతడు అలాగే ఆడాలి. అలా కాదని కోహ్లీలా కెప్టెన్సీ చేద్దాం అని ఆలోచిస్తే సెట్ అవ్వదని, అందుకే తానెలా ఉంటాడో అలాగే మ్యాచులు ఆడాలని కోరాడు.