జూన్ నుంచి హర్ ఘర్ దస్తక్ 2.0 కార్యక్రమం.. టార్గెట్ 200 కోట్లు..!!

-

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 192 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అక్టోబర్ 2021 నాటికి భారతదేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ దిశగా దూసుకెళ్తున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి జూన్ నెలలో ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి.. వారికి టీకా అందజేయాలని పేర్కొంది.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ దస్తక్ అభియాన్ 2.0’ కార్యక్రమం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమైనదని.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోందని, వ్యాక్సిన్‌ను వృథా చేయొద్దని సూచించారు. ఇంటింటికీ వెళ్లి.. ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయడమే ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news