హరిహర వీరమల్లు సినిమాపై హైపర్ ఆది హాట్ కామెంట్స్ చేశారు. హరిహర వీరమల్లు సూపర్ గా ఉందన్నారు హైపర్ ఆది. క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్లు, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని వెల్లడించారు.

అభిమానులకు నచ్చే విధంగా సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ ప్రతీ సీన్ చాలా కేర్ తీసుకుని చేశారన్నారు. ఆఫ్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన పవన్ ని చూశారు, ఆన్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమల్లును చూసి ఎంజాయ్ చేయండి అని వెల్లడించారు హైపర్ ఆది.
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయగా నిధి అగర్వాల్.. హీరోయిన్ గా మెరిసారు. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం సమర్పణలో మేఘసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు.