శరవేగంగా షూటింగ్..‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ కంప్లీట్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ పీరియాడిక్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ పిక్చర్ ను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర అప్‌డేట్ కోసం జనసేనాని అభిమానులు ఎదురు చూస్తుండగా, తాజాగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చేశారు.

ఓ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, ఇంకా కొన్ని షెడ్యూల్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు టాక్. ఈ చిత్ర స్టోరి మొఘలుల కాలం నాటిది. కాగా, ఇందులో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.

 

ఈ సినిమాలో కీలక పాత్ర కోసం KGF ఫేమ్ రవీనా టండన్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే, అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తు్న్నఈ సినిమాలో పవన్ కల్యాణ్ గెటప్స్ చాలా బాగుంటాయని ఇప్పటికే విడుదలై లీక్ డ్ ఫొటోస్ ద్వారా స్పష్టమవుతోంది. మొత్తంగా తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ శరవేగంగా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేస్తుండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్..‘గబ్బర్ సింగ్ ’ ఫేమ్ హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు టాక్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news