కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కి హరీష్ రావు సవాల్

-

తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కి మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ చేరకపోతే రాజీనామా చేస్తానని.. ఒకవేళ చేరితే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. వెంటనే నిర్మల సీతారామన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

2001 లోనే ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో చేరిందన్నారు మంత్రి. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరిందని లోక్సభలో కేంద్రమంత్రి చెప్పారని తెలిపారు. నిన్న కామారెడ్డిలో నిర్మల సీతారామన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం తెలంగాణలో ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరితోందని.. ఆరోగ్యశ్రీతోఆరోగ్యశ్రీతో 90 లక్షల మందికి తెలంగాణలో లబ్ధి చేకూరుతుందన్నారు.

కేంద్రం ఇచ్చింది 150 కోట్లు మాత్రమేనని.. రాష్ట్రం ఖర్చు చేసింది 8రాష్ట్రం ఖర్చు చేసింది 858 కోట్ల 98 లక్షలని తెలిపారు. నిర్మల సీతారామన్ పట్టపగలు అబద్ధాలు చెబుతున్నారని.. వెంటనే క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాలి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news