సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళతారని ఈమధ్య జోరుగా ప్రచారంం జరిగింది. శనివారం ప్రగతి భవన్ కేబినెట్ భేటీ, ఆ తర్వాత తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. అయితే తాజాగా మరో విషయం వెళ్లడైంది. ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 6న ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేయాలనే టీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ఇదే అంశంపై మాట్లాడారు. అలాగే ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం సూచించడంపై ఈ సమావేశాల్లో చర్చించనుంది.