కొన్ని పార్టీలు దేవున్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి : హరీష్‌ రావు

-

మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్‌ రావు. దేవుళ్లపై నిజమైన భక్తి సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేవున్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కానీ కేసీఆర్ ప్రాజెక్టులకు, జిల్లాలకు దేవుళ్ల పేరే పెట్టారని చెప్పారు. 60 ఏళ్ళ పాటు కాంగ్రెస్, టీడీపీ పాలించినా.. తెలంగాణ అభివృద్ధి కాలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

కేసీఆర్ పాలనలో మాత్రం రాష్ట్ర దశదిశ మారిందన్నారు. రైతు విలువను కేసీఆర్ పెంచాడని… దీంతో రైతు చేతిలో ఉన్న భూమి విలువ కూడా పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు బసవేశ్వరుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఆయన పేరుతో ప్రాజెక్టు కడుతున్నారని హరీష్ చెప్పారు. బసవేశ్వర ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news