తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి ధాన్యం కొనుగోళ్ల విషయంతో కేంద్ర ప్రభుత్వంపై, తెలంగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. తాజాగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తొండి ఆట ఆడినా ప్రతి గింజను కొన్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అయితే.. బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. బియ్యం కొనాలని ఢిల్లీలో ధర్నా చేశామని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. నూకల నష్టాన్ని మేమే బరిస్తామన్న బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. వర్షాలతో వడ్లు మొలకెత్తుతున్నాయని, రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాలని టీఆర్ఎస్ చూస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
బియ్యం ఎందుకు కొంటలేరో బీజేపీ స్పష్టం చేయాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ దీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వడ్లు కొంటమని చెప్పిన బీజేపీ నేతల గొంతు ఎందుకు ముగబోయిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుల వడ్లు వద్దు కానీ బీజేపీ నేతలకు ఓట్లు కావాలా అని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కష్ట కాలంలో టీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు బంధుకు 7500 ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు మంత్రి హరీష్‌రావు. రైతుల పట్ల బీజేపీది ద్వంద వైఖరని ధ్వజమెత్తారు మంత్రి హరీష్‌రావు.