ఆ ఐదు జిల్లాలే కమలానికి కీలకం!

-

ఇంతకాలం తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుందని విశ్లేషణలే తప్ప…ఖచ్చితంగా బీజేపీ బలం ఎంత పెరుగుతుందనేది మాత్రం తెలియలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని అనుకుంటున్న బీజేపీకి ప్రజల మద్ధతు ఎంతవరకు ఉన్నదనేది క్లారిటీ రాలేదు. ఏదో ఇటీవల ఊహాజనితంగా వచ్చిన కొన్ని సర్వేల్లో బీజేపీ పుంజుకుంటుందని మాత్రం తెలిసింది..అలాగే ఆ పార్టీ 30 సీట్ల వరకు గెలుచుకునే సత్తా ఉందని కొన్ని సర్వేల్లో బయటపడింది. కానీ అధికారికంగా మాత్రం ఏ సర్వే బయటకు రాలేదు.

అయితే తాజాగా వచ్చిన ఆరా సర్వేలో బీజేపీ బలం ఏంటో తెలిసింది…2018 ఎన్నికల నాటి నుంచి బీజేపీ బలం ఎలా పెరుగుతూ వచ్చిందో అర్ధమైంది. 2018లో 6 శాతం ఓట్లు వస్తే..2019 పార్లమెంట్ ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు బీజేపీకి 30 శాతం పైనే ఓట్లు వస్తాయని తేలింది. అంటే బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతుంది. అలాగే ఐదు జిల్లాల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిందని తెలిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో బీజేపీ బలం పెరిగిందని సర్వేలో తేలింది.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి 39 శాతం ఓట్లు వస్తుంటే..బీజేపీకి 35 శాతం వస్తున్నాయి..కాంగ్రెస్ పార్టీకి 18 శాతం మాత్రమే వస్తున్నాయి. ఈ జిల్లాల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య 4 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్-40 శాతం, బీజేపీ-35 శాతం, కాంగ్రెస్-16 శాతం వస్తున్నాయి. అంటే ఈ జిల్లాల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య 5 శాతం తేడా ఉంది. ఎన్నికల నాటికి బీజేపీ ఇంకా బలపడితే ఆ ఐదు జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చు.

అయితే మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీకి 30 శాతం ఓట్లు వరకు వస్తున్నాయి. కానీ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 20 శాతం మాత్రమే వస్తున్నాయి. అంటే ఈ ఐదు జిల్లాల్లో బీజేపీ బలం పెంచుకోవాల్సి ఉంది. ఈ జిల్లాల్లో కూడా సీట్లు కొన్ని తెచ్చుకుంటే…నెక్స్ట్ తెలంగాణలో అధికారం బీజేపీకి దక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news