తెలంగాణ జర్నలిస్టులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త

-

తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాలో అర్హులైన ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారిగా దళిత బంధు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు వెల్లడించారు. దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్ జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. ప్రారంభోత్సవానికి సభకు రావాల్సి ఉంది. వరదల కారణంగా రాలేకపోయాం. ముగింపు సభకు రావడం చాలా సంతోషంగా ఉంది.వృత్తి ధర్మం, సామాజిక న్యాయం చేసేందుకు కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతీ జర్నలిస్ట్ పై ఉన్నదని తెలిపారు.

వృత్తితో పాటు సామాజిక బాధ్యత కలిగిన వారు జర్నలిస్టు అని.. తెలంగాణ వచ్చాక ఎస్సీ గురుకుల పాఠశాలలు రెట్టింపు చేసుకున్నాం. ఇంకా అందులో సీట్లు మిగిలిపోతున్నాయని, జర్నలిస్టులు అవసరం ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి అవకాశాలు కల్పించేలా చొరవ చూపాలని కోరారు.
దళిత ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు సబ్సిడీల పై అవగాహన కల్పించి వారికి చైతన్యం కలిగించాలి. వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించే బాధ్యత ప్రతీ జర్నలిస్టులకు ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news