గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ నుంచి 5జీ సేవలు షురూ..

-

కేంద్ర ప్రభుత్వం 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ నెల 10 కల్లా పూర్తవుతుందని, వచ్చే అక్టోబర్ నుంచి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న 5జీ సేవల గురించి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల పదో తేదీకల్లా టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు పూర్తవుతుందన్నారు. అక్టోబర్ నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 5జీ ఎక్విప్‌మెంట్ త్వరగా ఏర్పాటు చేసి, సేవలు ప్రారంభించాల్సిందిగా సంస్థలను కోరుతున్నానని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలోనే టెలికాం సేవల ఛార్జీలు చాలా తక్కువ అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Union railway minister Ashwini Vaishnaw shares Koo giving 'sneak peak' into  India's first pod hotel | Latest News India - Hindustan Times

5జీ సేవలు కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయనుకుంటున్నాయన్నారు అశ్విని వైష్ణవ్. అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే మన దేశంలో టెలికాం సర్వీసుల ద్వారా వచ్చే రేడియేషన్ దాదాపు పది రెట్లు తక్కువగా ఉందని, రేడియేషన్ తక్కువగా ఉందంటే మనం నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లేనని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. సురక్షితమైన వాతావరణంలోనే మనం ఉన్నామని, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక.. 5జీ ఫోన్ల అమ్మకాలు బాగా పెరుగుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news