మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అందమైన మాటలు తప్ప కేటాయింపులు లేవని.. అంతా  డొల్లతనమే కనిపిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు.  బడ్జెట్‌లో ఏడు ప్రాధాన్యత రంగాలను కేంద్రం గాలికొదిలేసిందని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీల అమలు ప్రస్తావనే లేదని.. 9 ఏళ్లుగా అడుగుతుంటే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసేలేదని అసహనం వ్యక్తం చేశారు.

‘‘ నేతన్నలకు జీఎస్టీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఎరువులకు రాయితీలు భారీగా తగ్గించారు. నర్సింగ్‌, వైద్య కళాశాలల విషయంలో తెలంగాణకు మళ్లీ మొండి చేయి చూపారు. పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు గతేడాది రూ.9,243 కోట్లు కేటాయించి, ఈ సారి కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం పత్తి పండించే రైతులకు తీవ్ర నష్టం చేసే చర్యే. ’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news