ఆస్పత్రుల్లో మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌ : హరీశ్ రావు

-

ప్రతి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆస్పత్రుల్లో మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.

ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌లను నియమించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా బాగుందని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ 7 శాతం ఉంటే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 10శాతంగా ఉందని వెల్లడించారు.

‘‘ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల ప్రతినిధులకు నిమ్స్‌లో 2 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం టీవీవీపీ, ప్రైమరీ హెల్త్ కేంద్రాల ప్రతినిధులకు ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాలసిస్ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. టీచింగ్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మెరుగయ్యాయి. ఆపరేషన్‌ థియేటర్లలో అవసరమైన అన్ని పరికరాలు కొనుగోలు చేయాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశాం.’’ అని హరీశ్‌రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news