హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దోస్తీ కట్టాయి..సెంటిమెంట్‌ కు ఓటు వద్దు : హరీష్ రావు

హుజూరాబాద్ మండలం కన్నుక గిద్దే, జోపాక లో మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.కారులో ఎక్కించే పార్టీ టీఆర్ఎస్ కి ఓటు వేద్దామా..? కారుతో తొక్కించే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా..? అంటూ ప్రజలను చైతన్య చేసే ప్రయత్నం చేశారు. ధరలు పెంచే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా..? పేదలను కడుపులో పెట్టుకుని చూసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా..? అని ప్రజలను అడిగారు.

etela rajender harish rao


టీఆర్ఎస్ ను ఓడించేందుకు కమలం- హస్తం దోస్తీ కట్టిందని.. ఎవరో ఏడ్చారని, తిట్టారని ,సెంటిమెంట్ మాటలకు పడిపోవద్దని కోరారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి లేక బీజేపీ – కాంగ్రెస్ ఏకమైందని.. రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని పేర్కొన్నారు. మేం ఎన్నికల ముందే ఏం చేస్తామో చెప్తామని.. బీజేపీ కూడా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారు.. హుజూరాబాద్ కు మెడికల్ కాలేజి కావాలని, జిల్లా కావాలని రాజీనామా చేశారా…? అని నిలదీశారు. గెల్లు గెలిస్తే హూజూరాబాద్ ప్రజలకు లాభమని.. ఈటల గెలిస్తే బీజేపీకి లాభమని చెప్పారు.