విజయశాంతి చెల్లని రూపాయి… నా పుణ్యంతో ఎంపీ అయింది : హరీష్ రావు

బీజేపీ నేత విజయశాంతిపై ఫైర్‌ అయ్యారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు. మెదక్ లో చెల్లని రూపాయి వీణవంకలో చెల్లుతదా ? తన పుణ్యంతో విజయశాంతి ఎంపీగా గెలిచిందని చురకలు అంటించారు. ఈటల రాజేందర్‌ ది నోరా.. మోరా? పూటకో మాట మాట్లాడుతున్న ఈటల రాజేందర్ ను ఏ రకంగా విశ్వసించాలని మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.

ఇవాళ హుజురాబాద్‌ నియోజక వర్గం లో మంత్రి హరీష్‌ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ లో వడ్లు కొనకుంటే రోడ్ల పై పోసి తగల పెడుతున్నారు.. అక్కడ ఏ ప్రభుత్వం ఉందని నిలదీశారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో వడ్ల కొనడం లేదని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుందా.. లేదా ఆలోచించాలని ప్రజలను కోరారు. మంత్రిగా ఉండి ఈటల హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ కట్టాడు కానీ.. పేద విద్యార్థుల కోసం ఒక డిగ్రీ కాలేజీ తేలేకపోయాడని ఫైర్‌ అయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు మంత్రిగా పని చేసి.. హుజురాబాద్‌ నియోజక వర్గానికి కనీసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాడా ? అని నిప్పులు చెరిగారు.