ఈ మధ్య జనాలు పాపులారిటీ కోసం.. ఏవేవో చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ల వీడియో వైరల్ అవ్వాలి..అందుకోసం..భిన్నంగా ఉండాలి..ఇదే అనుకుంటున్నారు. బర్త్‌డే వేడుకల్లో తల్వార్లతో డ్యాన్స్‌లు వేస్తేనే మన పోలీసులు ఊరుకోరు.. వీడియో దొరికితే…మనుషులను వెతికి పట్టుకోని మరీ జైలులో వేస్తారు.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా గన్‌తోనే కేక్ కట్ చేశాడు.. ఇంకేముంది సీన్ కట్ చేస్తే పోలీసుల అదుపులో ఉన్నాడు..
ఢిల్లీలో ఒక వ్యక్తి తుపాకీతో బర్త్ డే వేడుకలు చేసుకుంటూ అదే తుపాకీని కత్తిలా ఉపయోగించి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో అతడు తుపాకీతో హల్‌చల్ చేస్తూ కత్తితో కోయాల్సిన కేకును తుపాకీతో కత్తిరిస్తూ కనిపించాడు.
ఢిల్లీలో ఒక వ్యక్తి తుపాకీతో బర్త్ డే వేడుకలు చేసుకుంటూ అదే తుపాకీని కత్తిలా ఉపయోగించి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో అతడు తుపాకీతో హల్‌చల్ చేస్తూ కత్తితో కోయాల్సిన కేకును తుపాకీతో కత్తిరిస్తూ ఉన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో… అది కాస్తా ఢిల్లీ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు.. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరో గుర్తించి సంఘం విహార్‌లోని నేబ్ సరాయి నుంచి అనికేత్ అలియాస్ అనిశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి 315 బోర్ పిస్టల్‌తో పాటు 2 లైవ్ రౌండ్స్ కలిగిన కాట్రిడ్జెస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.. గతంలోనూ ఢిల్లీలోని మాళవియా నగర్‌లో అనిష్ మరో కేసులో నిందితుడిగా ఉన్నాడట. ఈ ఘటనపై నిందితుడు అనికేత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసమే తాను ఈ పని చేశానని అంగీకరించాడు. స్థానికంగా ఉండే ఇతర నేరస్తుల ఎదుట తానేంటో నిరూపించుకోవడంతో పాటు స్థానిక యువత దృష్టిలో తన పాపులారిటీ పెరుగుతుందని ఇలా చేశాడని విచారణలో ఒప్పుకున్నాడు.
Taking cognizance of a viral video on social media wherein a young man was cutting cake with a pistol, #DelhiPolice identified the accused and arrested him from Neb Sarai along with .315 bore countrymade pistol & 2 live rounds. Case registered u/s 25 Arms Act. pic.twitter.com/CuBG65nvCP
— Delhi Police (@DelhiPolice) April 1, 2023