సుపారీ ఇచ్చిన వ్యక్తుల పేర్లు బయటపెట్టాలని మోదీని కోరిన కపిల్ సిబాల్

-

ప్రధాని నరేంద్ర మోదీ తన పతనానికి కొందరు సుపారీ ఇచ్చారని, తన వ్యక్తిత్వాన్ని పాడుచేసేందుకు కొందరు నానా విధాలుగా చూస్తున్నారని ఇంతకుముందు పేర్కొన్నారు. తన సమాధి కట్టేందుకు కూడా చూస్తున్నారని, ఇలాంటి వారికి మన దేశం లోనే కొందరు, దేశం వెలుపల కూడా కొందరు సహకరిస్తున్నారు అని తెలిపారు ఆయన. దీనిపై ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. సుపారీ ఇచ్చిన వ్యక్తుల పేర్లు బయటపెట్టాలని మోదీని వేడుకున్నారు కపిల్ సిబల్. వారి పేర్లు చెప్తే వారిపై చర్యలు తీసుకునే వీలుంటుందని తెలిపారు ఆయన.

Kapil Sibal asks Modi

వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, విదేశాలు కానీ… వీరిలో ఎవరో చెప్పండి… ఇది దేశ రహస్యంగా మిగిలిపోకూడదు… తప్పకుండా విచారిద్దాం అని వ్యక్తపరిచారు కపిల్ సిబాల్ మన దేశం లో ప్రజాస్వామ్య మనుగడ కష్టంగా ఉందని, దేశంలో దళితులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా మారిపోయారని రాహుల్ గాంధీ ఇటీవల కేంబ్రిడ్జి ప్రసంగంలో తెలిపారు. ఆ తర్వాత మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో శిక్ష పడడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు పడింది. ఈ పరిణామాలను గమనిస్తున్నామంటూ జర్మనీ, బ్రిటన్ దేశాలు వెల్లడించాయి. ఈ సందర్భం లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news