ఆరోగ్యమే మహా భాగ్యం… ఈ 7 డైట్ లో చేర్చండి.. మీ హెల్త్ కి ఢోకా ఏ ఉండదు..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పద్ధతులని అనుసరిస్తున్నారు. నిజానికి మన ఆరోగ్యం బాగుండాలంటే మన డైట్ కూడా బాగుండాలి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. వేసవిలో వేడి భారతదేశంలో విపరీతంగా ఉంటుంది ఇటువంటప్పుడు మీ బాడీని కూల్ చేసుకోవడం చాలా ముఖ్యం.. అలానే వేసవిలో డిహైడ్రేషన్, వాంతులు, డయేరియా వంటి సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి అటువంటివి కలగకుండా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ అద్భుతమైన సూత్రాలను చూసేయండి.

 

పుచ్చకాయ:

పుచ్చకాయ ఆరోగ్యనికి చాలా మంచిది. ఇది హైడ్రేట్ గా మిమ్మల్ని ఉంచుతుంది. నీటి శాతం ఇందులో అధికంగా ఉంటుంది. పుచ్చకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి అలానే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వేసవిలో కచ్చితంగా పుచ్చకాయని తీసుకోవడం మంచిది ఇది మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఆకుకూరలు:

ఆకు కూరల్లో కూడా నీటి శాతం ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి కూడా అందుతుంది ఆకుకూరలని తీసుకోవడం వలన కూడా మీరు ఆరోగ్యంగా ఉండగలరు.

బెర్రీస్:

స్ట్రాబెరీ బ్లూబెర్రీస్ వంటి వాటిలో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి మీ చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి కాబట్టి వీటిని కూడా మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మెలెన్స్:

వీటిని కూడా ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా మహిళలు మెలెన్స్ ని తీసుకోవడం వలన హార్మోనల్ సమస్యలు కలగవు.

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది వేసవిలో కచ్చితంగా కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకోండి.

బట్టర్ మిల్క్:

ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే దీని వలన డిహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.

కొత్తిమీర:

కొత్తిమీర ఒంట్లో ఉండే వేడి ని తొలగిస్తుంది అలానే మిమ్మల్ని చల్లగా ఫ్రెష్ గా ఉంచుతుంది యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఉంటాయి కనుక దీన్ని కూడా డైట్ లో తీసుకోవడం మంచిదే.

Read more RELATED
Recommended to you

Latest news