వింటర్ లో “హార్ట్ అటాక్” వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి ?

-

ఈ నెల నుండి ఫిబ్రవరి నెల వరకు చలికాలం ఉండనుంది. ఈ చలికాలంలో చాలా ఆరోగ్యం సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ చలికాలంలో ప్రమాదం అయ్యే గుండె పోటు ఎక్కువగా సంభవించే ఛాన్సెస్ ఉన్నాయంటూ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలి కాలం కావడంతో విపరీతమైన చలి కావడం వలన రక్తనాళాలు బిగుసుకుపోయి బీపీ పెరిగిపోయి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది అని చెబుత్తున్నారు. అయితే ఈ ప్రమాదం నుండి బయటపడడానికి రెగ్యులర్ గా హేల్తీ డైట్ తీసుకుంటూ ఉండడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంటూ వైద్యులు పదే పదే చెబుతున్నారు.

ఇది కాకుండా ఎప్పటికప్పుడు మీ బీపీని కూడా చూసుకుంటూ ఉండడం వలన మెడిసిన్ ఏమైనా మార్చాలా అన్నది కూడా అవగాహన వస్తుంది. ఇక అన్ని రోగాలకు ప్రధాన కారణం అయిన మందు మరియు సిగరెట్ లకు పూర్తిగా దూరం ఉండడం వలన చాలా రోగాలు మీ దరిచేరవు.

Read more RELATED
Recommended to you

Latest news