గత నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల చెరువులు నిండి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వరద నీరు పోటెత్తడంతో జలాశయాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద కొనసాగుతోంది.
గత నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. వరద నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,786 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.