ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. పెగాసన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తున్నారని తమ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అయిన పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ ఉపసంహరిస్తారా? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.
ప్రతీకార రాజకీయాలు చేయడానికా మీకు ప్రజలు పట్టం కట్టింది? అని అడిగారు. తక్షణమే పయ్యావుల కేశవ్ గారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు అచ్చెన్నాయుడు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.