గోదారమ్మ ఉగ్రరూపం.. భద్రాచలంకు వరద ప్రవాహం

-

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే చెరువు, వాగులు నిండి పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

Godavari water level reaches at 49 feet at Bhadrachalam

భారీగా వరద వస్తుండటంతో భద్రాద్రిలో స్నానఘట్టాల ప్రాంతం నీటమునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. కాగా, రాత్రి 12 గంటలకు 43 అడుగులు దాటింది. దీంతో మొదటి హెచ్చరిక జారీచేశారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news