ఎడిట్ నోట్: కేసీఆర్ ‘గోకుడు’!

-

కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి…ఒకసారిగా బయటకొచ్చి..లాంగ్ టైమ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్ధులని విమర్శించడంలో కేసీఆర్ ని మించిన వారు లేరనే చెప్పాలి..ఏదో టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్, పూజారా ఎక్కువ సేపు క్రీజులో నిలబడి ఎలా ఆడతారో..ఆ స్థాయిలో గంటల పాటు మీడియా సమావేశం పెట్టడంలో కేసీఆర్ తోపు అని చెప్పొచ్చు…ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో కమలనాథులు దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే..కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ ముందుకెళుతుంది.

ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరిగాయి..అలాగే భారీ స్థాయిలో మోదీ విజయ్ సంకల్ప్ సభ జరిగింది..ఈ సభ తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ బయటకు రాలేదు..ఏదో టీఆర్ఎస్ నేతలు…బీజేపీకి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు గాని…కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు.

అయితే ఇప్పటివరకు బయటకురాని కేసీఆర్..తాజాగా బయటకొచ్చి…వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించి…దాదాపు రెండున్నర గంటలపైనే మీడియాతో మాట్లాడారు…ఇక ఆయన మాట్లాడుతున్నంతా సేపు…బీజేపీని టార్గెట్ చేసి విమర్శించడమే..తెలంగాణలో బీజేపీ యాక్టివ్ గా ఉండటంపై విమర్శలు…బీజేపీ వాళ్ళు తనని ఏం చేయలేరనే విధంగా మాట్లాడుకొచ్చారు. అలాగే ఎంతమంది ఏకనాథ్ షిండేలు వచ్చిన తనని ఇంచు కూడా కదపలేరన్నట్లుగానే మాట్లాడారు.

దమ్ముంటే ఏకనాథ్ షిండే లాంటి వాన్ని తెలంగాణలో తీసుకు రా మోదీ అంటూ సవాల్‌ విసిరారు..మోదీ ఉడత ఊపులకు ఎవరు భయపడరంటూ ఫైర్ అయ్యారు. అలాగే తాను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్నట్లు చెప్పుకొచ్చారు..అలాగే టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తానని మరొకమారు చెప్పారు. అలాగే దేశంలో మోదీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.

ఇక తను ఎవరికీ భయపడనని, తనకు మనీ లేదు, లాండరింగ్ లేదుని అన్నారు. అలాగే “మాతో గోక్కుంటే అగ్గే.. మీరు మాతో గోక్కున్నా.. గోక్కోపోయినా దేశ ప్రజల కోసం నేను మిమ్మల్ని గోకుతూనే ఉంటా అంటూ” కేసీఆర్…బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. అంటే దేశ రాజకీయాల్లో బీజేపీపై కేసీఆర్ పోరు ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి…దేశంలో ఒక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ జోలికి…దేశ రాజకీయాలని నడిపే బీజేపీ రాలేదని కేసీఆర్ మాట్లాడుతున్నారు…కానీ ఒక రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ మాత్రం..దేశ రాజకీయాల్లో బీజేపీకి చెక్ పెడతానని అంటున్నారు. అంటే కేసీఆర్ బలానికి, మోదీ బలానికి తేడా ఉంది…అయినా సరే కేసీఆర్ మాటలు కోటలు దాటేస్తున్నాయనే చెప్పొచ్చు…అసలు దేశంలో బలంగా ఉన్న బీజేపీకి, మోదీ-అమిత్ షా ద్వయానికి చెక్ పెట్టడం అనేది ఈజీ కాదు. గతంలో చంద్రబాబు ఇలాగే ఏదో చేసేస్తానని ప్రగల్భాలు పలికి…అట్టడుగుకు పడిపోయారు. మరి బీజేపీని గోకుతూనే ఉంటా అంటున్న కేసీఆర్ పరిస్తితి ఏం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news