హైదరాబాద్‌లో వర్షం.. ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

-

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. అయితే.. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, ఆశోక్ నగర్, మియాపూర్, బాలానగర్, నేరేడ్ మెట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసిన సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. అయితే, నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్‌.. హైదరాబాద్‌ శివారు అయిన సైబరాబాద్‌లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

Hyderabad: Experts push for mass transit, no-car days | Hyderabad News -  Times of India

ఐకియా నుంచి జేఎన్‌టీయూ వరకు భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచి పోయింది. మరోవైపు నానక్‌రామ్‌ గూడ, బయో డైవర్సిటీ రూట్‌లోనూ వెహికిల్స్ స్లోగా ముందుకు కదులుతున్నాయి. కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌ రూట్‌లలోనూ భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు అటంకం కలుగుతోంది. అయితే, మరి కాసేపట్లోనూ మరోసారి వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్‌ జామ్‌ మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో పోలీసులు వాహనాల రద్దీని క్లీయర్ చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రయాణికులు తొందరగా ఇంటికి వెళ్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే భారీ వర్షం నేపథ్యంలో పలుచోట్లు రోడ్డు మీద నీరు నిలిచిపోయి..  వాహనాలు పోయేందుకు వీలు లేకుండా అయింది.

Read more RELATED
Recommended to you

Latest news