ఆ మాజీ మంత్రులకు సీటు టెన్షన్..సర్వేల్లో తేలిందేంటి?

-

వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. పొరపాటున వైసీపీ అధికారంలోకి రాకుండా..బాగా ఆగ్రహంతో ఉన్న టి‌డి‌పి అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పాల్సిన పని లేదు. అందుకే మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్ కష్టపడుతున్నారు. అయితే సర్వేలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నీ సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాలు మళ్ళీ అధికారంలోకి తీసుకురానున్నాయి.

కాకపోతే గత ఎన్నికల్లో వచ్చినట్లుగా వన్‌సైడ్ గా ఫలితాలు రావడం కష్టం. ఈ సారి గెలుపు కోసం కష్టపడాలి. అలాగే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు ఓటమి బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే గెలుపు అవకాశాలు లేని వారికి సీట్లు ఇవ్వనని జగన్ ముందే చెప్పేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పనితీరు బాగోలేదని తేలింది. వారిని జగన్ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఈ లిస్ట్ లో కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారని తేలింది. దీంతో మాజీ మంత్రులకు సీట్లు ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ రావడం లేదు. మొదట టి‌డి‌పి-జనసేన పొత్తు లేకుండా ఉంటే కొంతమంది గట్టెక్కుతారు. కానీ దాదాపు పొత్తు సెట్ అయ్యేలా ఉంది. దాని బట్టి చూసుకుంటే మాజీ మంత్రులు దాదాపు ఓటమి బాటపట్టేలా ఉన్నారు. కేవలం ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మినహా..మిగతా వారికి డౌటే.

పుష్పశ్రీ వాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఆళ్ళ నాని, పేర్ని నాని(పేర్ని తనయుడు పోటీ చేసే ఛాన్స్ ఉంది), వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నారాయణ…ఈ మాజీ మంత్రులు గెలుపు గుర్రం ఎక్కడం డౌటే అంటున్నారు. అయితే పొత్తు లేకపోతే వీరిలో చాలామంది గెలిచే ఛాన్స్ ఉంది. పొత్తు ఉంటే రిస్క్ ఉంది. మరి చూడాలి వీరిలో ఎంతమంది సీట్లు కోల్పోతారో.

Read more RELATED
Recommended to you

Latest news