హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, అమీర్ పేటర, సనత్ నగర్, ఖైరతాబాద్, గచ్చిబౌలీ, కొండాపూర్, హైటెక్ సిటీ, పటాన్ చెరు, ఈసీఐఎల్, ఎల్బీనగర్, చర్లపల్లి ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని చోట్ల 40 కి.మీ వేగంంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తోన్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన వర్షపు నీటితో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ పోల్స్ విరిగిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. కాగా నగరంలో మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.