భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం.. ఆరెంజ్‌ అలర్ట్‌

-

భాగ్యనగరమ్ లో హఠాత్తుగా వాతావరణం మరోసారి మారిపోయింది. కొన్ని చోట్ల మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్లలో వర్షం పడుతుంది. కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో అరగంట నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్, కాలిమందిర్, సన్ సిటీ, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాన కురుస్తుంది. ఈ కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక, పటాన్‌చెరు, సేర్లింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట్, బేగంపేట్, సికింద్రాబాద్, మలకాజిగిరి, అల్వాల్, కప్రా ప్రాంతాల్లో రానున్న గంటపాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Hyderabad records 95 mm of rain, close enough to surpass the monthly  average in next 24 to 48 hrs | Skymet Weather Services

ఇదిలా ఉంటే.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, పలు జిల్లా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news