వర్షాకాలం Monsoonలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, పోషకాహారం తీసుకుంటే కాస్త అనారోగ్య సమస్యల నుండి బయట పడడానికి వీలవుతుంది. అయితే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఈ విధానాలని అనుసరించండి. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు పైగా అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరవు.
అల్లం టీ:
అల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అల్లం టీ తాగడం వల్ల రిలీఫ్ ఉంటుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీనితో మీ ఆరోగ్యం బాగుంటుంది. అలానే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
వెల్లుల్లి మరియు తేనె:
వెల్లుల్లి, తేనే రెండూ కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. చలి కాలంలో, వర్షాకాలంలో ఇది చక్కని ప్రయోజనం ఇస్తుంది. ఈ టీ తీసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. మీరు వెల్లుల్లి చితక్కొట్టి దానిలో నీళ్లు పోసి మరిగించి.. ఆ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి ఆ మిశ్రమాన్ని తీసుకోండి.
లవంగం మరియు తేనె:
లవంగం తేనే కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాన్స్టిపేషన్ నుండి ఎలర్జీల వరకు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. గోరువెచ్చని నీళ్ళల్లో లవంగాలు వేసి.. ఒక టీ స్పూన్ తేనె కూడా వేసుకుని తీసుకుంటే సరిపోతుంది.
తులసి టీ:
తులసి ఆకుల్లో నీళ్లు పోసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వర్షాకాలంలో ఈ పద్ధతిని అనుసరించి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడండి.